Samantha: క్రైమ్ థ్రిల్లర్ లో సమంత ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(samantha) ఒకప్పుడు తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసేది కానీ గత కొన్నాళ్లుగా సమంత టాలీవుడ్ లో యాక్టివ్ గా లేదు. విజయ్ దేవరకొండ(Vijay devarakonda)తో చేసిన ఖుషి(kushi) సినిమా తర్వాత సమంత హీరోయిన్ గా మరో సినిమా వచ్చింది లేదు. ప్రస్తుతం అమ్మడి దృష్టంతా బాలీవుడ్ పైనే ఉంది. అందుకే అక్కడ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.
దీంతో తెలుగు ఆడియన్స్ సమంతను చాలా మిస్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సమంత తెలుగు సినిమాకు సైన్ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే గతేడాది సమంత తన బర్త్ డే సందర్భంగా మా ఇంటి బంగారం(maa inti bangaram) సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ అనౌన్స్‌మెంట్ తర్వాత మళ్లీ దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
తాజా సమాచారం ప్రకారం సమంత ఆ సినిమాను త్వరలోనే ముందుకు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. తన స్నేహితురాలు నందినీ రెడ్డి(nandini reddy) దర్శకత్వంలో సమంత ఆ సినిమా చేయనుందని, 1980 బ్యాక్ డ్రాప్ లోని క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. సెప్టెంబర్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుందట.