Madarasi: మదరాసి అసలు క్లైమాక్స్ వేరేనట

ముందు ఓ కథతో సెట్స్ పైకి వెళ్లి, షూటింగ్ కు వెళ్లాక ఆ కథ మారడం చాలా సందర్భాల్లో జరిగింది. రీసెంట్ గా వచ్చిన మదరాసి సినిమా కూడా అలానే ముందు అనుకున్నట్టు కాకుండా కథను మార్చి తీశారట. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా మురుగదాస్(murugadoss) దర్వకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మదరాసి(madarasi).
సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు తెలుగులో ఏ మాత్రం మంచి టాక్ రాలేదు. కానీ తమిళంలో మాత్రం మదరాసికి మిక్డ్స్ టాక్, మిక్డ్స్ రివ్యూలు వచ్చాయి. ఆ మిక్డ్స్ టాక్ తోనే మదరాసికి తమిళనాడులో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ వీకెండ్ ముగిసి వీక్ డేస్ వచ్చాక ఈ సినిమాకు తమిళనాడులో కూడా కలెక్షన్లలో భారీ డ్రాప్స్ కనిపించాయి.
ఇదిలా ఉంటే మదరాసి సినిమాకు ముందు అనుకున్న క్లైమాక్స్ ఇది కాదట. ముందు ఈ సినిమా క్లైమాక్స్ ను తాను హీరోయిన్ చనిపోవడంతో ప్లాన్ చేశానని, మాలతి(malathi) తన లైఫ్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఎవరికీ హెల్ప్ చేయని రఘు(raghu) ఆమె చనిపోయాక హెల్ప్ చేస్తాడు, అదే క్లైమాక్స్ గా మురుగదాస్ మొదట్లో ప్లాన్ చేసుకున్నాడట. కానీ తన గర్ల్‌ఫ్రెండ్ ను కాపాడుకోలేకపోతే హీరో క్యారెక్టర్ బలహీనమవుతుందనిపిచి షూటింగ్ మధ్యలో క్లైమాక్స్ ను మార్చానని మురుగదాస్ చెప్పారు. అయితే సినిమా రిలీజై ఫలితం వచ్చేశాక ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.