Jubilee Hills: అక్కడి నుంచి పోటీ చేయడం లేదు : దానం నాగేందర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అధిష్ఠానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) అన్నారు. ఆదర్శ్‌నగర్ (Adarshnagar) లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ (Shadi Mubarak) , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్(Jubilee Hills) లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా మ్యుమని అన్నారు. అక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. టికెట్ (Ticket) ఎవరికీ కేటాయించినా పార్టీ గెలుపుకోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.







