MSG: మన శంకరవరప్రసాద్ గారుకి ఐకాన్ స్టార్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నయనతార(nayanthara) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(venkatesh) గెస్ట్ రోల్ లో నటించగా, సాహు గారపాటి(saahu garapati), సుష్మిత కొణిదెల(Sushmitha konidela) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ థియేటర్లకు బారులు తీరుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయినందుకు పలువురు సెలబ్రిటీలు పోస్టులు పెడుతుండగా రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) ఓ పోస్ట్ చేశారు.
మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్.. ఈ మూవీతో చిరంజీవి గారు మళ్లీ థియేటర్లలో సందడి చేయడం చాలా సంతోషంగా ఉందని, వెంకీ గౌడ పాత్రలో వెంకటేష్ ఇరగదీశాడని, నయనతార, కేథరిన్(catherine) తమ నటనతో ఆకట్టుకున్నారని, భీమ్స్(Bheems) అందించిన ప్రతీ సాంగ్ చాలా బావుందని, అనిల్ రావిపూడి ప్రతీ సంక్రాంతికీ వస్తారు, హిట్టు కొడతారు, రిపీట్ అంటూ పోస్ట్ చేస్తూ, ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్బస్టర్ కాదని, బాస్ బస్టర్ అని రాసుకొచ్చారు. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
https://x.com/alluarjun/status/2013544153460941057?s=20






