Rahman: వివాదంపై స్పందించిన రెహమాన్ పిల్లలు
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత పెద్ద వివాదానికి దారి తీశాయో తెలిసిందే. బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన కారణాలు కూడా అయుండొచ్చని ఆయన ఇన్‌డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ను అందరూ తప్పుబట్టడంతో తర్వాత ఆ విషయంపై రెహమాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇండియా తనకు ఇల్లు లాంటిదని, తాను మ్యూజిక్ ఇక్కడే నేర్చుకున్నానని, ఎవరినీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని, ఆర్టిస్టులకు, మ్యూజిక్ కు గౌరవం తగ్గుతుందనే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడానని రెహమాన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆయనపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. దీంతో తన తండ్రికి సపోర్ట్ ఇస్తూ అమీన్ రెహమాన్(Ameen Rahman) చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
తన తండ్రి గొప్పదనాన్ని అందరికీ చాటి చెప్తూ, గతంలో రెహమాన్ ను మోదీ ప్రశంసించిన వీడియోను అమీన్ పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ వివాదంలో రెహమాన్ కూతుళ్లు ఖతీజా(Khathija), రహీమా(Raheema) కూడా స్పందించారు. పవిత్ర గ్రంథాలను చదివి క్రమశిక్షణ నేర్చుకోవడానికి ప్రజలకు సమయం ఉండదు కానీ ఎవరినైనా నిందించడానికి, అగౌరవ పరచడానికి మాత్రం ఎప్పుడూ సమయముంటుందని రహీమా కాస్త ఘాటుగానే స్పందించింది.
https://www.instagram.com/p/DTsRkS8jM8v/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==






