Ramachandra Rao: దావోస్‌కు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? : రామచందర్‌రావు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో ఇండియా కూటమిలో ఐక్యత లేదని స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ (Meet the Press) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్లకు జీతాలు రావడం లేదు. యూనివర్సిటీ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో యూనివర్సిటీలను నడుపుతూ భావితరాలను అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) కి వెళ్లి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని సీఎం రేవంత్ (CM Revanth) గొప్పలు చెప్పారు. దావోస్ (Davos) కు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? దారి ఖర్చులు కూడా వచ్చినట్లు లేదు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షావాతం వచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు తప్ప. అమలు చేయరు. యువత గురించి ప్రభుత్వం ఆలోచించాలి అని అన్నారు.







