RBI: ఆర్‌బీఐ కళ్లు చెదిరే డీల్.. రూ.3,472 కోట్లతో

దక్షిణ ముంబయిలోని నారీమన్ (Nariman) పాయింట్ ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రికార్డు ధరకు 4.61 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందుకోసం ముంబయి (Mumbai) మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. దీంతో ఈ ఏడాది భూమి కొనుగోళ్లలో ఇదే అత్యధిక ధర అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌బీఐ( ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ (Metro Rail Corporation) లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసిన భూమి మంత్రాలయ, బాంబే హైకోర్టు, కొన్ని కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లకు సమీపంలో ఉంది.