Samantha: సమంత కొత్త లుక్ కు నెటిజన్లు ఫిదా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే తన ఫ్యాన్స్ కు , ఫాలోవర్లకు ఎక్కువ టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే సమంత తాజాగా నెట్ డిజైన్ హై స్లిట్ గౌన్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ కాంబినేషన్ లో డ్రెస్ కు మ్యాచింగ్ మేకప్, సింపుల్ స్ట్రైట్ హెయిర్ స్టైల్ తో స్టైలిష్ గా కనిపించింది. ఈ ఫోటోల్లో సమంత లుక్స్, యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అమ్మడిని మరింత అందంగా మార్చాయి. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.