క్లారిటీ ఇచ్చేసిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత(samantha) లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా మా ఇంటి బంగారం(maa inti bangaram)పై సినీ వర్గాల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. పెళ్లి తర్వాత సమంత నుంచి వస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తోంది. నందినీ రెడ్డి(nandini reddy) దర్శకత్వంలో ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్, యాక్షన్ అంశాలను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ ను కూడా సమంగా మోసుకెళ్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రీసెంట్ గా రిలీజ్ డేట్ పై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. రామ్ చరణ్(ram charan) నటిస్తున్న పెద్ది(peddi) ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడుతున్న నేపథ్యంలో మా ఇంటి బంగారం ఆ డేట్ కు రానుందనే వార్తలు వినిపించాయి. అయితే వాటిని ఖండిస్తూ, ముందే నిర్ణయించినట్లుగా మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, సంతోష్ నారాయణన్(santhosh narayanan) స్వరపరిచిన తస్సాదియ్యా(Thassadiyya) అనే ఫ్యామిలీ పార్టీ సాంగ్‌ను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ట్రలాలా మూవింగ్ పిక్చర్స్(Tralala moving pictures) బ్యానర్‌పై సమంతతో పాటు హిమాంక్ రెడ్డి(himank reddy), రాజ్ నిడిమోరు(raj nidimoru), డీకే(DK) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథలో కీలక పాత్రల్లో గుల్షాన్ దేవయ్య(Gulshan devaiah), సత్యరాజ్(Satyaraj), గౌతమి(Gauthami), శ్రీముఖి(Sree mukhi) వంటి నటీనటులు కనిపించనున్నారు. బలమైన కంటెంట్, విభిన్న కథనంతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.
ఇవి కూడా చదవండి






