mumbai: నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి.. గ్యాంగులకు సంబంధం లేదంటున్న పోలీసులు…

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి జరిగింది. నటుడి ఇంటిలో చొరబడిన దుండగులు… సైఫ్ పై కత్తితో దాడి చేశాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ను.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ముంబయి (Mumbai)లోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. (Saif Ali Khan injured)
ఫైర్ ఎగ్జిట్ మార్గాన్ని అనువుగా మార్చుకున్న దుండగుడు.. ముందురోజే సైఫ్ అలీఖాన్ కుమారుడు జెహ్.. రూమ్ లో నక్కినట్లు పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారు జాము 2.30 గంటలకు .. దొంగతనానికి ప్రయత్నించగా.. కేర్ టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దుండగుడు సైఫ్ పై పదునైన కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో సైఫ్ కు పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ముఖ్యంగా వెన్నెముక బాగా డ్యామేజ్అయిందని.. ఆపరేషన్ చేసి సరిచేసినట్లు లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లు వివరించారు. ప్రస్తుతం సైఫ్ సేఫ్ అని వారు చెప్పారు.
ఈ ఘటన బాలీవుడ్ తో పాటు ముంబైలోనూ ప్రకంపనలు రేపింది .దీంతో సైఫ్ ఇంటికి చేరుకున్న క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ నిపుణులు… ఆధారాలు సేకరించారు. సైఫ్ ఇంటిలో పనివాళ్లను విచారించారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఆస్పత్రిలో సైఫ్ నుంచి అధికారులు స్టేట్ మెంట్ నమోదు చేశారు. ఇద్దరు దుండగులు .. ఈ రాబరీకి రాగ.. ఒకరు దాడి చేసినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
నటుడు ఉండే హౌసింగ్ సొసైటీలో కొన్ని చోట్ల ఇళ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో బయట నుంచి పనివారు వచ్చిపోతున్నారు. ఇదే అదనుగా దొంగలు సైతం రాబరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకుంటామన్నారు. మరోవైపు సైఫ్ ఇంటిపై దాడితో .. మహారాష్ట్ర సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలోప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నాయి.