అమెరికా పర్యటనకు బయల్దేరిన.. రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తలైవా సాధారణ వైద్య పరీక్షల కోసం శనివారం ఉదయం ఆయన సతీమణి లతాతో కలిసి చెన్నై ఎయిర్‍పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి స్పెషల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో అమెరికా బయలుదేరారు. తలైవా తన హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. కొవిడ్ ఉధృతి తగ్గడంతో యూఎస్‍ఏ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రాని కోరడంతో.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అమెరికాకు పయనమయ్యారు. కొన్ని వారాల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. రజనీకాంత్ తిరిగి జూలై 8న భారత్‍కు వస్తారని తెలుస్తోంది.