Pushpa2: ఆగని పుష్ప డామినేషన్.. 49వ రోజుకలెక్షన్లు ఎంతంటే…?

పుష్ప 2 (Pushpa 2) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆగడం లేదు. సినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తైనా సరే వసూళ్లు మాత్రం దూసుకుపోతున్నాయి. 49వ రోజు కూడా ఈ సినిమా పర్వాలేదనిపించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ దాదాపు 1000 షోలతో దేశవ్యాప్తంగా విజయవంతంగా రన్ అవుతోంది. బేబీ జాన్, గేమ్ ఛేంజర్ (Game changer), ఆజాద్, ఎమర్జెన్సీ వంటి కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ, పుష్ప 2 థియేటర్లలో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయిన 7వ ఆదివారం… పుష్ప 2: ది రూల్ 1.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రం ఈ సోమ, మంగళవారాల్లో వరుసగా రూ.65 లక్షలు రాబట్టగా, బుధవారం నాడు రూ. 50 లక్షలు వసూలు చేసింది. నేషనల్ మీడియా లెక్కల ప్రకారం పుష్ప 2 వసూళ్లు రూ. 1230.05 కోట్లగా ఉన్నాయి. ఇది కేవలం ఇండియాలో మాత్రమే. హిందీ బెల్ట్ లో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి ఇంకా ఆదరణ తగ్గలేదు. బుధవారం ముంబైలో 131 షోలు రన్ అవ్వగా.. ఢిల్లీలో 217 షోలతో 9.22 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. పుష్ప 2 తర్వాత విడుదలైన గేమ్ ఛేంజర్, బేబీ జాన్ చిత్రాలు ఈ సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1831 కోట్లు రాబట్టిందని మేకర్స్ చివరిగా అనౌన్స్ చేసారు. ఆ తర్వాత దీనిపై ఇంకా మీడియాకు మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే పుష్ప 2 నిర్మాతలపై ఐటి దాడులు జరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, ఇళ్ళపై ఐటి అధికారులు దాడులు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలను, బ్యాంకు లాకర్లను పరిశీలిస్తున్నారు. ఇక 500 కోట్లకు సంబంధించిన లెక్కలపై స్పష్టత రాలేదని వార్తలు వస్తున్నాయి.