Prabhas: చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి విమానంలో తెప్పించిన ప్రభాస్
ప్రభాస్(prabhas).. తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరుగాంచిన ఈ పాన్ ఇండియా స్టార్, తన వ్యక్తిత్వంతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. యాక్షన్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించినప్పటికీ, వ్యక్తిగతంగా మాత్రం సాదాసీదా జీవనశైలిని అనుసరిస్తారు. ముఖ్యంగా ఆయన అతిథి సత్కారం గురించి ఇండస్ట్రీలో ఎన్నో కథలు వినిపిస్తుంటాయి. షూటింగ్ సెట్స్‌లో ఎవరు వచ్చినా, సమయానికి రుచికరమైన భోజనం పెట్టి పంపించడం ఆయన అలవాటు. రీసెంట్ గా ప్రభాస్ వెల్లడించిన ఒక ఆసక్తికర సంఘటన మరింత చర్చనీయాంశమైంది. ముంబైలో ఆదిపురుష్(Adhipurush) షూటింగ్ జరుగుతున్న సమయంలో చెన్నై నుంచి ప్రత్యేకంగా ఫుడ్ ఆర్డర్ చేసి విమానంలో తెప్పించారట. ఆ ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ఆశ్చర్యపోయి మీరు మామూలు వాళ్లు కాదండీ అని చెప్పినట్టు ప్రభాస్ గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
రీసెంట్ గా రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ(Couple friendly) సినిమాను చూసి ప్రభాస్(prabhas), ఆ సినిమా తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఎమోషనల్ పరంగా నెక్ట్స్ లెవెల్ లో ఉందని ప్రశంసించారు. సినిమా ముగిసిన తర్వాత కూడా ఆ ఫీల్ నుంచి బయటపడేందుకు సమయం పట్టిందని వెల్లడించారు. చిత్రబృందాన్ని ప్రత్యేకంగా కలుసుకుని అభినందనలు తెలియజేసిన ఆయన, మంచి ప్రేమకథలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు.
అభిమానుల కోసం సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నానని, కానీ రిలీజ్లు మాత్రం తగ్గుతున్నాయని ప్రభాస్ స్పష్టం చేశారు. అందరూ తనకు యాక్షన్ సినిమాలంటే ఇష్టమనుకుంటారని, కానీ తనకు అన్ని జానర్లూ సమానమని చెప్పారు. ప్రత్యేకంగా గీతాంజలి(Geethanjali) సినిమాను ఎంతో ఇష్టపడతానని, మణిరత్నం(Mani ratnam) ఫ్యాన్ ను అని వెల్లడించారు. కపుల్ ఫ్రెండ్లీ చూసినప్పుడు గీతాంజలి చూసిన ఫీల్ కలిగిందని, అందుకే మళ్లీ మళ్లీ చూడాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి

















