Peddi: పెద్ది షూటింగ్ అప్డేట్

గేమ్ ఛేంజర్(game changer) తర్వాత రామ్ చరణ్(ram charan) హీరోగా చేస్తున్న సినిమా పెద్ది(Peddi). సుకుమార్(Sukumar) శిష్యుడు బుచ్చిబాబు సాన(buchibabu sana) ఈ సినిమాకు డైరెక్టర్. ముందు నుంచి ఈ మూవీపై మంచి అంచనాలే ఉండగా సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ఆ అంచనాలను ఇంకాస్త పెంచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. పెద్ది సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఆగస్ట్ 20వ తేదీ నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుందని, ఈ షెడ్యూల్ లో చరణ్, జాన్వీ పై ఓ భారీ సాంగ్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
రెహమాన్(Rahmna) ఈ సాంగ్ ను చాలా కొత్తగా కంపోజ్ చేశాడని, ఆ సాంగ్ చరణ్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అసలే చరణ్, జాన్వీ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో వీరిద్దరి పెయిర్ ఆన్ స్క్రీన్ పై ఎలా ఉంటుందోనని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.