పెద్ది ఓ పెద్ద పనైపోయింది!
టాలీవుడ్లో ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో పెద్ది(Peddi) ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram Charan) హీరోగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా(buchi babu sana) తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా తాజాగా కీలక దశను పూర్తి చేసుకుంది. సినిమా ఫైనల్ ఎడిట్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి(Naveen Nooli) ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, కథలోని భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌ను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన పెద్ది ఇప్పుడు రిలీజ్ దశకు చేరుకోవడంతో మార్కెట్లో కూడా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా బుచ్చిబాబు సానా విజన్, రామ్ చరణ్ కొత్త లుక్, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథ అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషన్స్, మాస్ యాక్షన్, విజువల్ గ్రాండియర్ కలయికగా ఉండబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిర్మాతలు కూడా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీమియర్ షోలను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. జూన్ 3 నుంచి స్పెషల్ ప్రీమియర్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్దిపై భారీ బజ్ నెలకొనగా, అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






