Pawan kalyan: నిర్మాతల కోసం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఐదేళ్ల నుంచి మూడు సినిమాలకు సైన్ చేసి వాటిని ముందుకు తీసుకు వెళ్లకుండా అదే స్థితిలో ఉంచిన పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో కాస్త షూటింగ్ లో పాల్గొంటున్నారు. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్.
అందుకే షూటింగ్ కూడా మంగళగిరిలోనే ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక తర్వాత సుజిత్ (Sujith) డైరెక్షన్లో రాబోయే.. ఓజి(OG) సినిమా షూటింగ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్స్ ఇచ్చేశారు. నెలలో పది రోజులపాటు సినిమా షూటింగులు చేయడానికి పవన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. కనీసం వారం రోజులైనా సినిమా షూటింగ్లకు సమయం కేటాయించాలని పవన్ సిద్ధమవుతున్నారు. దీనితో నిర్మాతలు కూడా కాస్త జోష్లో ఉన్నారు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ కు అలాగే డైరెక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి సినిమా కోసం ఖర్చుపెట్టారు నిర్మాతలు.
ఈ సినిమాలు ముందుకు వెళ్ళక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండటంతో వారి సిట్యుయేషన్ అర్థం చేసుకున్న పవన్ ఇక సినిమాల షూటింగ్ ను వాయిదా వేయవద్దని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఓజీ సినిమాను ఎలాగైనా విడుదల చేసేందుకు పవన్ ఓకే చెప్పారట. దీనితో సుజిత్ కూడా పవన్ లేకుండానే కొన్ని సీన్లను ఇప్పటికే షూట్ చేశారు. ఇక ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొనే ఛాన్స్ ఉంది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఆ సినిమా షూటింగ్లో జూన్ నుంచి లేదా జూలై నుంచి పాల్గొనాలని, ప్రతి సినిమాకు మూడు నెలలు టైం కేటాయించి వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని ఆ తర్వాత మిగిలిన సినిమాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు.