OTT: ఈవారం మూవీ లవర్స్ కోసం ఓటీటీ ఫీస్ట్..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మూవీ లవర్స్ కోసం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లో తీసుకురావడానికి ఓటీటీ ప్లాట్ ఫాన్స్ కూడా ముందంజలో ఉన్నాయి. ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం గత మూడు రోజుల్లో (జనవరి 22, 23, 24) ఎనిమిది సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఐదు తెలుగు స్ట్రైట్ సినిమాలు, ఒక తెలుగు వెబ్ సిరీస్, మరో రెండు డబ్బింగ్ కంటెంట్ ఉన్నాయి. ఇవి ప్రతీ ఒక్కటీ విభిన్న జోనర్‌లో ఉండటంతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభవాన్ని అందిస్తున్నాయి.
రజాకార్ (Rajakar)
తెలంగాణలో రజాకార్ ఆక్రమాలు, ఆపరేషన్ పోలో వంటి చారిత్రక అంశాల ఆధారంగా రూపొందిన ”రజాకార్” చిత్రం జనవరి 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం హిస్టారికల్ కాన్సెప్ట్‌ను ఇష్టపడే వారికి బాగా నచ్చే అవకాశం ఉంది.
శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ (Srikakulam Sherlock Holmes)
వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జనవరి 24 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘చంటబ్బాయ్ తాలూకా’ అనే క్యాప్షన్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
సివరపల్లి (Sivarapalli)
ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ తెలుగు రీమేక్ అయిన ”సివరపల్లి” జనవరి 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. గ్రామీణ జీవితంలోని సామాజిక అంశాలను సున్నితంగా చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
హిసాబ్ బరాబర్ (Hisab Barabar)
”మాధవన్” ప్రధాన పాత్రలో నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ”హిసాబ్ బరాబర్” జనవరి 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంక్ స్కామ్‌ల నేపథ్యంలో నడిచే ఈ కథ అందరికి ఆసక్తికరంగా అనిపిస్తుంది.
హైడ్ అండ్ సీక్ (Hide and seek)
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ”హైడ్ అండ్ సీక్” ఇటీవల సన్ నెక్ట్స్‌లో విడుదలైంది. ఇది ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉంది. జనవరి 24 నుంచి ఈ మూవీ సన్ నెక్ట్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.
వైఫ్ ఆఫ్ (Wife of)
80 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఎమోషనల్ థ్రిల్లర్ ”వైఫ్ ఆఫ్” జనవరి 23 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, ప్రతీకారం లాంటి ప్రధాన అంశాలతో ముందుకు సాగే ఈ థ్రిల్లర్ మంచి ఆదరణ అందుకుంటుంది.
బరోజ్ 3డీ (Barroz)
మలయాళ సూపర్ స్టార్ ”మోహన్ లాల్” ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ ”బరోజ్ 3డీ” జనవరి 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసే మూవీలలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.
ఫియర్ (Fear)
వేదిక ద్విపాత్రాభినయం చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ”ఫియర్” జనవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది.
ఈ ఎనిమిది కంటెంట్ ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా ఉండటంతో ఓటీటీలో ఈ వారం మంచి వినోదాన్ని అందించాయి. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన మూవీని చూసి ఎంజాయ్ చేయండి.