NTR: ఎన్టీఆర్ కన్నడ లవ్.. బిగ్ ప్లానే..!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ఇప్పుడు కర్ణాటక మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. దేవర సినిమా సక్సెస్ లో కర్ణాటక కీ రోల్ ప్లే చేయడంతో కర్ణాటక విషయంలో ఈ స్టార్ హీరో ఎక్కువ మమకారం కురిపిస్తున్నాడు. తన తల్లి సొంత రాష్ట్రమైన కర్ణాటకలో తన సినిమాలను ఎక్కువగా ప్రమోట్ చేసే ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ఇక తన తర్వాతి సినిమాల్లో ఎక్కువగా కన్నడ నటులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కన్నడ కూడా అనర్గళంగా మాట్లాడగలిగే ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో చేయబోయే సినిమా కూడా కర్ణాటకలోనే షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేసుకున్నాడు.
ఈ విషయంలో ప్రశాంత్ కూడా అంగీకారం తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను త్వరలో మైసూర్ లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. మైసూర్ సమీపంలోని బందిపూర్ పులుల అభయారణ్యంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. జనవరి మూడో వారం నుంచి ఈ సినిమా షెడ్యూల్ మొదలుకానుంది. ఆ తర్వాత.. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ షూటింగ్ కు అటెండ్ అవుతాడు.
వార్ 2 షూటింగ్ త్వరలోనే పూర్తయిపోతుందని… ఆ తర్వాత ఎన్టీఆర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని సినీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన న్యూస్ అధికారికంగా బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా నటిస్తోంది. ఇక గెస్ట్ పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ని తీసుకుంటున్నాడు ప్రశాంత్. ఈ సినిమాను ఒకేసారి మూడు భాషల్లో షూటింగ్ చేయనున్నారు. కన్నడ తో పాటు తమిళంపై కూడా ఎన్టీఆర్ ఫోకస్ పెట్టాడు. త్వరలోనే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు.