Lavanya Tripathi: రెండో ప్రెగ్నెన్సీపై లావణ్య సంచలన కామెంట్స్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి(lavanya tripathi) మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో అందమైన జంటగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్(Varun tej)- లావణ్య జంట ఎప్పుడూ అభిమానుల దృష్టిలో ఉంటూనే ఉంటుంది. తాజాగా తన కొత్త చిత్రం సతీ లీలావతి(Sati leelavathi) ప్రమోషన్స్ సందర్భంగా యాంకర్ సుమ కనకాల(Suma kanakala)తో జరిగిన చిట్‌చాట్‌లో లావణ్య తన పర్సనల్ లైఫ్ పై ఓపెన్ అయింది. ముఖ్యంగా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైమ్ లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని, ఆ దశలో శారీరకంగా, మానసికంగా చాలానే ఇబ్బందులు పడ్డానని ఆమె వెల్లడించారు. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నానని లావణ్య స్పష్టం చేసింది.
బిడ్డ పుట్టిన తర్వాత జీవితమే మారిపోయిందని లావణ్య భావోద్వేగంగా చెప్పింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎదురైన కష్టాలు అన్నీ కొడుకును చూసిన క్షణంలో మరిచిపోయానని అంది లావణ్య. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కంఫర్ట్‌గా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చని అనిపిస్తోందని లావణ్య చెప్పింది. తల్లి అయిన తర్వాత తనలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఆలోచనా విధానం నుంచి జీవన శైలివరకు చాలా మార్పులు జరిగాయని, తమ కొడుకు వాయువ్(Vaayuv) తన జీవితానికి కొత్త అర్థం తీసుకొచ్చాడని ఆమె ఆనందంగా చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్- లావణ్య జంట తమ పర్సనల్ లైఫ్‌ను ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచుకుంటూ వస్తోంది. అయినప్పటికీ, అప్పుడప్పుడూ ఇలాంటి ఇంటర్వ్యూల్లో వారు షేర్ చేసుకునే విషయాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు మార్చి 6న విడుదల కానున్న సతీ లీలావతి సినిమాపై లావణ్య పూర్తి నమ్మకంతో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తుంది. పర్సనల్ లైఫ్ లో సంతోషంగా ఉండటంతో పాటు, కెరీర్లో కూడా బలంగా ముందుకు సాగుతున్న లావణ్య చేసిన సెకండ్ ప్రెగ్నెన్సీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.






