Koratala-Chaithu: చైతన్యతో కొరటాల సినిమాపై తాజా అప్డేట్
పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ(koratala siva) ఆచార్య(acharya) సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్(NTR) తో దేవర(Devara) సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్న కొరటాల, ఆ తర్వాత దేవర2 ను చేస్తాడని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టే దేవర2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర2(Devara2) అప్డేట్ కోసం వెయిట్ చేస్తుండగా సడెన్ గా కొరటాల, అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaithanya)తో సినిమాతో చేస్తున్నారని వార్తలొచ్చాయి. కొరటాల చైతూతో సినిమా చేస్తే మరి దేవర2 పరిస్థితేంటని తారక్ ఫ్యాన్స్ షాకవగా, కొరటాల- చైతూ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం కొరటాల, చైతన్యతో సినిమా చేయాలనుకున్న వార్తలు నిజమేనని, కాకపోతే చైతన్యతో కొరటాల తీసే సినిమాకు ఆయన కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారని, ఆ సినిమాకు వేరే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. మరి ఆ కథకు కొరటాల కథను ఏమైనా అందిస్తాడేమో చూడాలి.







