బీచ్ అందాలను డామినేట్ చేస్తోన్న కియారా
భరత్ అనే నేను(Bharath ane nenu) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కియారా అద్వానీ(Kiara advani), ఇప్పుడు గ్లోబల్ లెవల్ లో వెలిగిపోతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తూ, వెకేషన్స్ కి వెళ్తూ వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా మాల్దీవ్స్ వెకేషన్లో కియారా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth malhotra), కూతురు సరాయా(sayara) తో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

ఈ ఫొటోల్లో వైట్ కలర్ బీచ్ వేర్లో కియారా దేవకన్యలా కనిపిస్తోంది. తెల్లటి బికినీ సెట్‌పై మ్యాచింగ్ క్రోచెట్ స్టైల్ స్కర్ట్ ధరించి, బీచ్ సైడ్ ఎలిగెంట్ లుక్‌లో కియారా మెరిసిపోతోంది.

సెమీ షీర్ మెష్ మిడి స్కర్ట్, దానికి సైడ్ స్లిట్ ఉండటంతో ఆమె లుక్ చాలా గ్లామరస్‌గా ఉంది.

సముద్రపు అలల మధ్య, ఇసుక తిన్నెలపై కియారా షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.






