IT Rides: దిల్ రాజును ఆ సినిమానే ముంచిందా…?

టాలీవుడ్ (Tollywood) లో ఐటీ దాడులు దెబ్బకు సినిమా వాళ్ళు హడలిపోయారు. ఎప్పుడు ఎవరిపై ఐటి అధికారులు గురిపెడతారో.. అర్థం కాక చెమటలు కక్కారు. మూడు రోజులపాటు జరిగిన ఐటీ దాడులు నాలుగో రోజు కూడా కొనసాగాయి. అయితే ఎక్కువగా అగ్ర నిర్మాత దిల్ రాజును (Dil Raju) ఐటి అధికారులు టార్గెట్ చేశారు. ఇక పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టి దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఒక తమిళ సినిమాకు సంబంధించిన పత్రాలు విషయంలో ఐటీ అధికారులు కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టి పరిశీలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి దిల్ రాజు కూడా సరైన లెక్కలు చూపించకపోవడంతో ప్రాథమికంగా ఆయనపై కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు కుమార్తె హన్సితా రెడ్డి బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు పరిశీలించారు. అలాగే ఆయన అల్లుడి బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు దృష్టిసారించారు. ఇక ఇదే టైంలో తమిళ స్టార్ హీరో విజయ్ తో తీసిన ఒక సినిమా దిల్ రాజుకు తలనొప్పులు తెచ్చింది అనే ప్రచారం జరుగుతుంది.
ఆ సినిమాకు సంబంధించిన లెక్కలను దిల్ రాజు సరిగా చూపించలేదని ఐటి అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. అందుకే దిల్ రాజు కార్యాలయం ఇల్లు అలాగే పలువురు సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక దిల్ రాజును కచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. సంక్రాంతి కానుకగా దిల్ రాజు రెండు సినిమాలను విడుదల చేశారు. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, రెండు గేమ్ చేంజర్ సినిమాలు ఈ రెండు సినిమాల్లో గేమ్ చేంజెర్ సినిమా డిజాస్టర్ అయింది. అయినా సరే వసూళ్లు భారీగా వచ్చాయని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రచారమే దిల్ రాజు కొంపముంచిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.