Harish Shankar: పవన్ మ్యానరిజమ్ ను డీకోడ్ చేయనున్న హరీష్ శంకర్
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ అనేది కేవలం హిట్స్‌తో మాత్రమే కాదు, స్పెషల్ స్టైల్‌తో కూడా ఏర్పడుతుంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పేరు వినగానే అభిమానుల మదిలో మెదిలే మొదటి ఇమేజ్.. మెడ మీద చెయ్యి పెట్టుకునే సిగ్నేచర్ మ్యానరిజమ్. ఇది కేవలం ఒక పోజ్ కాదు, కోట్లాది మంది ఫ్యాన్స్ కు అదొక ఎమోషన్. అందుకే ఈ మ్యానరిజమ్ ను ఎంతో మంది అనుకరిస్తూ కనిపిస్తారు. అయితే ఈ మ్యానరిజమ్ వెనుక అసలు కథ ఏమిటి? అది యాదృచ్ఛికంగా పుట్టిందా? లేక దానికి స్పెషల్ గా అర్థం ఉందా? అన్న ఆసక్తికర ప్రశ్నలు మాత్రం చాలా కాలంగా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
ఈ సందేహాలకు సమాధానం చెప్పేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్(harish shankar) ముందుకొచ్చారు. ఫిబ్రవరి 22న మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్‌ను డీకోడ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పవన్‌తో కలిసి తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad bhagath singh) ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ మ్యానరిజమ్ ఎలా రూపుదిద్దుకుంది? దాని వెనుక ఉద్దేశం ఏమిటి? లాంటి అంశాలపై ఆ రోజు పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. గతంలో వీరి కలయికలో వచ్చిన గబ్బర్‌సింగ్(Gabbar singh) బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై కూడా భారీ హైప్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల(Sree Leela), రాశీ ఖన్నా(Raashi khanna) హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన దేఖ్లేంగే సాలా(Dheklenge saala) సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించగా, ఫిబ్రవరి 22న సెకండ్ సింగిల్ ఆరా ఆఫ్ ఉస్తాద్(Aura of ustaad) రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి

















