DSP: సుకుమార్ డైరెక్షన్లోనే హీరోగా ఎంట్రీ.. కానీ
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎల్లమ్మ(Yellamma) సినిమాతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు బలగం(Balagam) ఫేమ్ వేణు యెల్దండి(Venu Yeldandi) దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేస్తూ, టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవిశ్రీ, హీరోగా తన ప్రయాణం ఎలా మొదలైందో వెల్లడించారు. నిజానికి తాను చాలా కాలం కిందటే హీరోగా పరిచయం కావాల్సిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆలస్యమైందని తెలిపాడు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తనను హీరోగా లాంచ్ చేయాలని ఒకప్పుడు ప్లాన్ చేశారని దేవిశ్రీ(DSP) గుర్తుచేశాడు. అయితే అదే టైమ్ లో తన తండ్రి మరణించడంతో తీవ్ర భావోద్వేగ పరిస్థితుల్లో ఉన్న తాను ఆ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టలేకపోయానని చెప్పాడు. సుకుమార్‌తో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని, ఆయన తీసిన అన్ని సినిమాలకూ తానే సంగీతం అందించానని పేర్కొన్నారు. సుకుమార్ తో పాటూ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas), హరీష్ శంకర్(harish sankar) కూడా కూడా తాను నటించాలంటూ తరచూ ప్రోత్సహించేవారని వెల్లడించాడు.
ఈవెంట్స్ లో తన డ్యాన్స్, ఎనర్జీ చూసి చాలామంది డైరెక్టర్లు హీరోగా ట్రై చేయమని చెప్పేవారని దేవిశ్రీ తెలిపాడు. కుమారి21F(Kumari21F) సినిమాలోని బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ కు తానే ట్యూన్ చేసి, లిరిక్స్ రాసి, డ్యాన్స్ కంపోజ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అల్లు అరవింద్(Allu Aravind), దిల్ రాజు(Dil Raju) లాంటి ప్రముఖ నిర్మాతలు కూడా తనను యాక్టింగ్ వైపు అడుగులు వేయమని ప్రోత్సహించారని చెప్పారు. అందరి నమ్మకం, ప్రోత్సాహమే ఇప్పుడు తాను హీరోగా ముందుకు రావడానికి ధైర్యం ఇచ్చిందని దేవిశ్రీ ప్రసాద్ స్పష్టం చేశాడు.

















