పెద్దిపై హైప్ పెంచుతున్న రత్నవేలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన(buchibabu sana) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi)పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే వేగం అందుకున్నాయి. తాజాగా సినిమాకు డీఓపీగా పనిచేసిన రత్నవేలు(Ratnavelu) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ యాక్టింగ్ ఆడియన్స్ ను పూర్తిగా భావోద్వేగానికి గురి చేస్తుందని ఆయన చెప్పడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. చరణ్ తన కెరీర్లోనే అత్యంత ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని రత్నవేలు పేర్కొనడం ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది.
సినిమాలో ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, దానికి మించిన ఎమోషనల్ ఇంపాక్ట్ కలిగించే మరో క్రికెట్ ఎపిసోడ్ కూడా ఉంటుందని రత్నవేలు వెల్లడించారు. మొదట ఈ సన్నివేశాన్ని పగటిపూట తెరకెక్కించాలని భావించినప్పటికీ, రాత్రి వేళ షూట్ చేస్తే ఎమోషన్ మరింత బలంగా కనెక్ట్ అవుతుందని తానే సూచించానని చెప్పారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ కూడా అంగీకరించారని తెలిపారు. ఇక సినిమాలో నైట్ ఎఫెక్ట్ ఫైట్, రైల్వే యార్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.
కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి ఎమోషనల్ జర్నీగా పెద్ది తెరకెక్కుతోందని రత్నవేలు వివరించారు. సినిమాలో జాన్వీ కపూర్(Janhvi kapoor) ఓ ఎమ్మెల్యే కూతురి పాత్రలో కనిపించనుండగా, ఆ ఎమ్మెల్యే పాత్రను రావు రమేష్(Rao ramesh పోషిస్తున్నట్లు తెలిపారు. అలాగే సినిమాలో ఆసక్తికరమైన హాస్పిటల్ సీక్వెన్స్ కూడా ఉంటుందని చెప్పారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా భావోద్వేగం ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం నిలిచిపోతుందని రత్నవేలు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి






