తారక్ పుట్టిన రోజున అన్నింటికీ క్లారిటీ గ్యారెంటీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు సమాచారం. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ టైటిల్ గ్లింప్స్ విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తారక్ తదుపరి ప్రాజెక్టులపై అనేక ఊహాగానాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
మరోవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) రూపొందించనున్న మైథలాజికల్ డ్రామా గాడ్ ఆఫ్ వార్(GOd Of War)లో హీరోగా ఎన్టీఆర్ నటిస్తాడనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే ఇదే పాత్ర కోసం అల్లు అర్జున్(Allu Arjun) పేరు కూడా ప్రధానంగా వినిపించడం ఆసక్తిని పెంచుతోంది. ఈ స్పెక్యులేషన్స్‌కు మే 20న క్లారిటీ వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక చాలా కాలంగా చర్చల్లో ఉన్న దేవర2పై కూడా కొత్త రూమర్లు వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) బాలకృష్ణతో సినిమా ప్రకటించడంతో దేవర2 నిలిచిపోయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా కొత్త పోస్టర్ విడుదలైతే ఈ ప్రాజెక్ట్ ట్రాక్‌లో ఉన్నట్టే అని అభిమానులు భావిస్తున్నారు.
ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) ఎన్టీఆర్ – నెల్సన్ దిలప్ కుమార్(Nelson Dilipkumar) కాంబినేషన్లో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు కేవలం సెలబ్రేషన్కే పరిమితం కాకుండా, ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులపై నెలకొన్న అనేక సందేహాలకు సమాధానం చెప్పే రోజుగా మారనుంది.






