పెద్ది ట్రైలర్ కోసం భారీ ప్లాన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది(Peddi) రిలీజ్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా మేకర్స్ స్ట్రాటజిక్‌గా ముందుకు సాగుతున్నారు. విడుదలకు ముందు కీలక మైలురాయిగా భావించే థియేట్రికల్ ట్రైలర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ ద్వారానే సినిమాకు సంబంధించిన టోన్, స్కేల్‌ను స్పష్టంగా చూపించాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఈ ట్రైలర్లో రామ్ చరణ్ పాత్రను పూర్తిగా కొత్త కోణంలో ప్రెజెంట్ చేయనున్నారట. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రల కంటే భిన్నంగా, మాస్ ఎనర్జీతో కూడిన అగ్రెసివ్ షేడ్స్ ఇందులో హైలైట్ అవుతాయని చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కీలక సన్నివేశాలు, హై- ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లు ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఫస్ట్ ఇంప్రెషన్‌గా ఈ ట్రైలర్ ఎంతగానో పనిచేయాలని చిత్ర బృందం టార్గెట్‌గా పెట్టుకుంది.
వృద్ది సినిమాస్(Vriddhi cinemas) నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్(Siva rajkumar), బొమన్ ఇరానీ(Boman irani), జగపతి బాబు(Jagapathi babu) వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం ఈ సినిమాకు మరింత బలం చేకూర్చనుంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో, ట్రైలర్ స్పందనపై సినిమాకు ఓపెనింగ్స్ కూడా ఆధారపడి ఉండటం గమనార్హం. దీంతో పెద్ది టీమ్ ట్రైలర్‌ను హైప్ పెంచే ప్రధాన ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి






