Akhanda 2: బాలయ్య-బోయ టార్గెట్ నార్త్ ఇండియా…?

నట సింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna), స్టార్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీను కాంబినేషన్ అనగానే మాస్ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా సరే బాలకృష్ణను చూపించే విధానంలో మాత్రం బోయపాటి ఎక్కడా కూడా తగ్గరు. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య రేంజ్ కూడా పెరిగిపోయింది. దీనితో బోయపాటి… బాలయ్యతో సినిమా చేస్తున్నారు అనగానే ఫ్యాన్స్ లో ఒక తెలియని ఉత్సాహం కనబడుతోంది. ప్రస్తుతం అఖండ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్న బోయపాటి ఇప్పటికే షూటింగ్ కూడా కొంత కంప్లీట్ చేశారు.
ఎలాగైనా సరే ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బోయపాటి పట్టుదలగా ఉన్నారు. ఇక బాలయ్య కెరీర్ లో ఈ సినిమా తొలి పాన్ ఇండియా మూవీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. నార్త్ ఇండియాలో సినిమా షూటింగ్ రీసెంట్ గా జరిగింది. మహా కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. అఖండ పార్ట్ 1 కు నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ రావడంతో సీక్వెల్ విషయంలో కూడా భారీ మార్కెట్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అందుకే ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ శురూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ నటుడిని కూడా తీసుకునేందుకు బాలయ్య ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డాకు మహారాజ్ సినిమా సక్సెస్ తో బాలకృష్ణ మంచి ఊపు మీద ఉన్నారు. ఇక ఈ సినిమా మార్కెట్ కూడా భారీగానే జరుగుతుందని మేకర్స్ లెక్కలు వేస్తున్నారు. అందుకే నార్త్ ఇండియా పై గట్టిగానే గురిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటివరకు నార్త్ ఇండియా మార్కెట్ పై బాలకృష్ణ ఫోకస్ చేయలేదు. కానీ అక్కడ దేవుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలుకు మంచి డిమాండ్ ఉండటంతో బాలయ్య అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బోయపాటి కూడా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగానే కథలో మార్పులు కూడా చేశారు. ఈ సినిమాలో కుంభమేళా సన్నివేశాలు కచ్చితంగా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది.