పెద్ది కోసం రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్.. ఎక్కడంటే?
రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్ కు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) తన వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) బ్యానర్‌పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 225 వేల డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనంగా మారింది. ముఖ్యంగా రామ్ చరణ్‌ను ఇప్పటివరకు చూడని ఓ పవర్ఫుల్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నారన్న వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. భారీ స్థాయి విజువల్స్, గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్‌ను మరింత పెంచేందుకు నిర్మాతలు వరుస ప్రమోషనల్ ఈవెంట్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. మే 18న ముంబైలో థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుండగా, మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(A. R.Rahman) ప్రత్యక్షంగా పాల్గొని చికిరి, రయ్ రయ్ రా రా లాంటి సాంగ్స్ ను లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నారని సమాచారం. ఈ ఈవెంట్స్ ద్వారా దేశవ్యాప్తంగా పెద్దిపై ఉన్న హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor), శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), జగపతి బాబు(Jagapathi Babu), దివ్యేందు శర్మ(Divyenndu Sharma) కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త సినీ అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసంగా చెబుతోంది. ఇప్పటికే ఫైనల్ కట్ సిద్ధమైందని, అవుట్‌పుట్‌పై యూనిట్ పూర్తి నమ్మకంతో ఉందని సమాచారం. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






