Pushpa 2: నాన్ బాహుబలి కాదు.. ఇక నాన్ పుష్ప 2…!

టాలీవుడ్ లో ఇప్పటివరకు బాహుబలి (Bahubali) సినిమా రికార్డుల గురించి ఎక్కువగా చర్చ జరిగేది. ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాహుబలి సినిమా రికార్డులు బద్దలు కొడుతుందా…? అంటూ ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఇక పాన్ ఇండియా సినిమాలు అనగానే బాహుబలి సినిమానే ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది. బాహుబలి పార్ట్ 2 క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. అయితే ఇప్పుడు బాహుబలి సినిమా రికార్డులను పుష్ప పార్ట్ 2 బ్రేక్ చేసింది.
గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు వరుస పెట్టి రికార్డులను తుడిచిపెడుతోంది. ఒక్కో సినిమా రికార్డును బ్రేక్ చేసుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా బాహుబలి సినిమా రికార్డులు కూడా బ్రేక్ చేసింది పుష్ప పార్ట్ 2 (Pushp 2). రిలీజ్ రోజు ఏకంగా 294 కోట్లు వసూలు చేసిన పుష్ప 2 సినిమా… తాజాగా బాహుబలి ఆల్ టైం వసూళ్ళ రికార్డు కూడా బ్రేక్ చేసేసింది. బాహుBoబలి పార్ట్ 2.. 1810 కోట్లు వసూలు చేస్తే ఇప్పుడు పుష్ప పార్ట్ టు ఏకంగా 1831 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.
హిందీలో ఈ సినిమా 806 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు సినిమా రికార్డులను చెప్పడానికి నాన్ బాహుబలి అని.. బాహుబలి అని డివైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం పుష్ప పార్ట్ 2 క్రియేట్ చేసిన సునామీతో నాన్ పుష్ప 2 రికార్డులు అంటూ హడావుడి చేయనున్నారు. మరో మూడు నాలుగు రోజులు ఇదే ఊపు కంటిన్యూ అయితే మాత్రం కచ్చితంగా ఈ సినిమా 2000 కోట్లకు క్రాస్ చేయడం ఖాయం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకు భారీగా మార్కెట్ క్రెడిట్ కావడం అల్లు అర్జున్ (Allu Arjun) కు కచ్చితంగా మంచి ఊపిచ్చే న్యూస్. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా గాని ఏ హిందీ సినిమా గాని నార్త్ ఇండియాలో ఈ రేంజ్ లో మార్కెట్ చేయలేదు.