అమెరికా మార్కెట్ కు కేన్సర్ మందు

కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్‌సైన్సెస్‌కు సరఫరా చేయనుంది. దీనిపై రెండు సంస్థల మధ్య లైసెన్సింగ్-సరఫరా ఒప్పందం కుదిరింది. ఈ ట్యాబ్లెట్లను అమెరికాలో జైడస్ లైఫ్‌సైన్సెస్ విక్రయిస్తుంది. కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్, ఎగ్జెలిగ్సిస్ ఇంక్, అనే యూఎస్ కంపెనీకి చెందిన కాబోమెటిక్స్ అనే బ్రాండుకు జనరిక్ ఔషధం. ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ ఈ మందుకు యూఎస్‌ఎఫ్ డీఏ వద్ద పారా`4 సర్టిఫికేషన్‌తో ఏఎన్‌డీఏ ( అబ్రివియేటెడ్ స్యూడ్రగ్ అప్లికేషన్) దరఖాస్తు చేసింది. అందువల్ల ఈ జనరిక్ ఔషదాన్ని యూఎస్‌లో విక్రయించడానికి 180 రోజుల ప్రత్యేక మార్కెటింగ్ హక్కులు (ఇఎంఆర్) లభిస్తాయని జైడస్ వివరించింది. జైడస్‌తో కలిసి ఈ మందును యూఎస్ మార్కెట్‌కు అందించబోతున్నామని ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్‌ఎన్ రెడ్డి అన్నారు.