వరల్డ్ సూపర్-రిచ్ జాబితాలో అదానీ, ముకేశ్…. ఇదే తొలిసారి

ప్రపంచంలో 100 బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన సూపర్ రిచ్ క్లబ్ లో 15 మంది చేరారు. ఈ జాబితాలోకి ఇంతమంది చేరడం ఇదే తొలిసారి. వీరిలో భారత్ నుంచి గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ కూడా ఉండడం విశేషం. కృత్రిమ మేధ, విలాసవంత వస్తువులకు గిరాకీ, భౌగోళిక రాజకీయాల్లో మార్పుల కారణంగానే వీరందరి సంపద పెరిగింది. సూపర్`రిచ్ జాబితాలోని 15 మంది సంపద ఈ ఏడాది 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ రాబడులను అధిగమించి వీరి సంపద వృద్ధి చెందింది. ప్రపంచంలోని తొలి 500 మంది సంపన్నుల సంపదలో పావు వంతు ఈ 15 మంది వద్దే ఉండడం గమనార్హం.