ట్రంప్ సర్కారుతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం : నాస్కామ్

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికాలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టు భారతీయ ఐటీ రంగ సంస్థల సంఘం నాస్కామ్ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షల్ని కూడా తెలియజేసింది. భారత్`అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఐటీ పరిశ్రమల పాత్ర కీలకమని గుర్తుచేసిన నాస్కామ్ ఇరు దేశాల మధ్య ప్రగతిదాయక సాంకేతిక భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తామంటూ పేర్కొన్నది. 254 బిలియన్ డాలర్ల భారతీయ టెక్నాలజీ ఇండస్ట్రీకి అమెరికానే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నది. అమెరికా జీడీపీకి భారత ఐటీ కంపెనీల ద్వారా 80 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతున్నది.