వాట్సాప్ కొత్త ఫీచర్.. ఆ వివరాలు ట్రాక్ చేయలేరు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త సదుపాయాలను అందించడంతో పాటు భద్రతాపరమైన ఫీచర్లపైనా దృష్టి సారించింది. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను రింగ్ అవ్వకుండా సైలెన్స్ చేసుకునే సదుపాయాన్ని ఆ మధ్య తీసుకొచ్చిన వాట్సాప్, ఇప్పుడు ఐపీ అడ్రస్‌ను, లొకేషన్‌ను ప్రొటెక్ట్ చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఆడియో, వీడియో కాల్స్ సమయంలో లొకేషన్, ఐపీ అడ్రస్ వివరాలు అవతలి వారికి తెలీయకుండా చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి రాగా మరికొందరికి ఇంకా అందుబాటులోకి రావల్సి ఉంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేయాలంటే త్రీడాట్స్ మెనూలోని ప్రైవసీలోనికి వెళ్లాలి. అక్కడ కనిపించే అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో ప్రొటక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అయితే, ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే కాల్ క్వాలిటీ కొంత మేర తగ్గుతుందని వాట్సప్ చేస్తొంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నా కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయని పేర్కొంది.






