వాట్సప్ మరో కొత్త ఫీచర్
వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్ కాల్స్ కోసం ప్రత్యేకంగా వాయిస్ ఛాట్స్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ వాయిస్ ఛాట్స్ ఫీచర్‌ను రోల్ అవుట్ చేసినట్టు వాట్సప్ యాప్ వెల్లడిరచింది. సాధారణంగా ఉండే గ్రూప్ కాల్స్‌కు ఈ ఫీచర్ కాస్త భిన్నం. వాట్సప్ గ్రూప్ కాల్ వస్తే, గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు రింగ్‌టోన్ వస్తుంది. ఏ మీటింగ్‌లోనో ఉన్నప్పుడు ఇలా గ్రూప్ కాల్ వస్తే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ వాట్సప్ వాయిస్ ఛాట్స్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీంతో వాట్సప్ నుంచి గ్రూప్ కాల్స్ వస్తే ఎలాంటి రింగ్ రాదు. గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్ నోటిఫికేషన్ మాత్రమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దీంతో వాయిస్ ఛాట్‌లో పాల్గొనాలనుకొనే వారు కాల్ ముగిసేలోగా ఎప్పుడైనా జాయిన్ అవ్వొచ్చు. గ్రూప్‌లో ఈ వాయిస్ ఛాట్ సాయంతో 60 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా కాల్ కట్ అవుతుంది. కాల్లో జాయిన అయిన వ్యక్తులు మాత్రమే సంభాషణల్ని వినటానికి వీలుంటుందని వాట్సప్ పేర్కొంది.






