Minister Ponnam : వారెన్ని చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే: మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచు ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓడిపోవడంతో కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో (Adi Srinivas) కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కూతురు కవిత (Kavitha) అడుగుతున్న ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు జవాబు చెప్పాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మునిసిపాలిటీలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మరింత అభివృద్ధి చేయడానికి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.






