76 లక్షల వాట్సప్ ఖాతాలపై నిషేధం… ఎందుకో తెలుసా?

మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఫిబ్రవరిలో పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ నియమాకాలు 2021 ఉల్లంఘన, వాట్సప్ దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఏకంగా 76 లక్షల ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఫిబ్రవరి నెలకు సంబంధించి తన నెలవారీ నివేదికలో ప్రకటించింది. ఫిబ్రవరి 1`29 మధ్య 76,28,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ వెల్లడించింది. వీటిలో 14,24,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ తెలిపింది.