భారత్-అమెరికా మధ్య ఒప్పందం
అంకురాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా వినూత్నతను ప్రోత్సహించేందుకు భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. నియంత్రణ పరమైన ఇబ్బందులు, ఎంటర్ ప్రెన్యూర్ల నిధుల సమీకరణకు ఉత్తమ విధానాలు వంటివి ఈ ఒప్పందం ద్వారా సరళతరం కావొచ్చని తెలుస్తోంది. శాన్ఫ్రాన్సిస్కోలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సంతకాలు జరిగాయి. పరిశ్రమ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ పరిశ్రమలోని ముఖ్య సంస్థలు సీఈఓలు, దిగ్గజ ఐసీటీ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, క్రిటికల్, వర్ధమాన సాంకేతికత రంగంలోని అంకురాల వ్యవస్థాపకులు చర్చలో పాల్గొన్నారు. యూఎస్-భారత్ సాంకేతిక భాగస్వామ్యం పెరగడానికి ఉన్న అవకాశాలను వివరించారు.






