ప్రపంచంలోనే తొలిసారిగా.. ఆమోదించిన అమెరికా
చికున్‌గున్యాతో జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ టీకా వాడకానికి అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. దోమల ద్వారా వ్యాపించే వైరస్‌ను ఈ టీకా ద్వారా అడ్డుకోవచ్చని ఎఫ్‌డీఏ అధికారులు చెప్పారు. 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు దీనిని ఉపయోగించవచ్చని వెల్లడించారు. వైరస్ ప్రబలుతున్న దేశాల ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. లిక్స్‌చిక్ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను విక్రయించనున్నారు.






