డొనాల్డ్ ట్రంప్ మీడియా నాస్ డాక్ లో లిస్టింగ్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ తాజాగా నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యింది. 50 డాలర్ల ధరలో డీజేటీ సింబల్‌తో నాస్‌డాక్‌లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ కౌంటర్‌లో ట్రేడింగ్ ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:45 ప్రాంతంలో ట్రంప్ మీడియా షేరు నాస్‌డాక్‌లో 39 శాతం దూసుకెళ్లి 69.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.