Raghuram Rajan : ట్రంప్ ఎదిగేందుకే ఈ సుంకాల భారం : రఘురాం రాజన్

భారత్‌పై అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లు కేవలం ట్రేడ్ టూల్ మాత్రమే కాదని రిజర్వ్ బ్యాంక్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదిగేందుకే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ సుంకాల భారం మోపుతున్నారని అభిప్రాయపడ్డారు. టారిఫ్‌ల భారం భారత్‌కు ఓ మేలుకొలుపు లాంటిది. ఏ దేశంపైనా విస్తృతంగా ఆధారపడకూడదు. యూఎస్‌తో వాణిజ్యం కొనసాగిస్తూనే ఐరోపా(Europe) , ఆఫ్రికా (Africa) వంటి దేశాలపైనా దృష్టి సారించాలి. ఈ రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక అవసరాలు యుద్ధానికి ఆయుధాలుగా మారుతున్నాయి. వీటిపట్ల న్యూఢల్లీి (New Delhi) జాగ్రత్తగా వ్యవహరించాలి. వృద్ధికి ఊతమిచ్చే యువతకు ఉపాధి కల్పించే సంస్కరణలను తీసుకురావాలి అని సూచించారు.