మీ మలం ఖరీదు .. రూ.1.4 కోట్లు

మలాన్ని (పూప్) పంపిస్తే ఏడాదికి రూ.1.4 కోట్లు చెల్లిస్తామని అమెరికాకు చెందిన హ్యూమన్ మైక్రోబ్స్ కంపెనీ ప్రకటించింది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండే వారి నుంచే దీన్ని తీసుకొంటామని వెల్లడించింది. అయితే పూప్ ట్రాన్స్‌ప్లాంట్ (ఫెకల్ ట్రాన్స్‌ప్లాంట్) ప్రయోగాల కోసమే కంపెనీ ఈ ప్రకటన చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డోనర్ నుంచి సేకరించిన పూప్‌ను డ్రైఐస్, ఎలక్ట్రోలైట్ తదితర ప్రక్రియాల్లో శుద్ధి చేస్తారు.