అతి త్వరలో భారత్ లో టెస్లా.. తక్కువ ధరకే
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా అతి త్వరలో భారత్‌లో తన ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చే అవకాశముంది. దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి)పై టారిఫ్‌లను తగ్గించాలన్న టెస్లా అభ్యర్థనను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. కంపెనీ దేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సుంకం రాయితీ కోసం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీని వలన భారతదేశం భారీ కస్టమ్స్ సుంకం తగ్గుతుంది. దీంతో కార్ల ధరలు దిగివచ్చే అవకాశముంది.






