టెస్లా కీలక నిర్ణయం… కొత్త వెర్సన్ కు బదులుగా పాత వెర్షన్
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ బీటా వెర్షన్లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. వెంటనే కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో భాగంగా కొత్త వెర్షన్‌కు బదులుగా పాత వెర్సన్ కావాలని టెస్లా తన వాహనదారులకు విన్నవించింది. స్వీయ-డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) బీటా సాఫ్ట్వేర్ తాజా వెర్షన్‌ను అక్టోబర్ 24న విడుదల చేసింది. విడుదలైన ఒక రోజులోనే కొల్లిజన్ వార్నింగ్స్ విషయంలో సమస్యలు ఉన్నట్టు వినియోగదారులు టెస్లాకు రిపోర్ట్ చేసినట్లు తెలిసింది. తాజాగా రిలీజ్ చేసిన ఎఫ్ఎస్డీ 10.3 బీటా వెర్సన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు ఉండడంతో 10.2 ఎఫ్ఎస్డీ సాఫ్ట్వేర్ వెర్షన్‌ను వాడాలని కంపెనీ వినియోగదారులకు సూచించింది.






