TCS : ఉద్యోగులకు టీసీఎస్ శుభవార్త

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగుల (Employees ) కు శుభవార్త (Good news) చెప్పింది. మెజారిటీ సిబ్బంది వేతనాలను 4.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబరు (September) నెల నుంచి జీతం పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ (Increment) పత్రాలు అందజేసే ప్రక్రియ సోమవారం సాయంత్రం నుంచే ప్రారంభమైందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. కింది, మధ్య స్థాయి సిబ్బంది అందరికీ వేతనం పెరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అత్యుత్తమ పనితీరు కనబర్చిన వారికి వేతనాన్ని 10 శాతానికి పైగా పెంచినట్లు తెలిసింది. మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటంతో గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన వేతన పెంపు ఎట్టకేలకు అమల్లోకి వచ్చాయి.