శంషాబాద్ టు సింగపూర్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నూతన డైరెక్ట్ విమాన సర్వీసును సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 20వ వార్షికోత్సవానికి పురస్కరించుకొని ఈ సర్వీసును ప్రారంభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఆదివారం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్క్యూ519 విమానం శంషాబాద్ నుంచి 11:20 గంటలకు బయలుదేరి 18:20 గంటల ( సింగపూర్ స్టాండర్స్ టైమ్)కు సింగపూర్ చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో సింగపూర్ నుంచి 8 గంటల ( సింగపూర్ స్టాండర్ట్ టైమ్)కు బయలుదేరి 10:15 గంటల ( ఐఎస్టీ)కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుతుందని తెలిపారు.






