బడ్జెట్ ను స్వాగతించిన సీరం సీఈవో..
కేంద్ర బడ్జెట్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా స్వాగతించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్వస్త్ భారత్ పథకాన్ని ప్రకటించింది. మంత్రి నిర్మలా సీతారామన్ ఆ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సుమారు 64 వేల కోట్లతో స్వస్త్ స్కీమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీన్ని ఆధార్ పూనావాలా ఆహ్వానించారు. హెల్త్‌కేర్, వ్యాక్సిన్ రంగాలకు కేంద్ర బడ్జెట్ కేటాయించిన తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏ దేశానికైనా ఇదే అత్యుత్తమ పెట్టుబడి అని ఆయన అన్నారు. భారత్ ఎంతో ఆరోగ్యంగా ఉంటే, దేశం అంత ఉత్పాదాన చేస్తుందని ఆయన అన్నారు.






