దేశంలో నంబర్ 1 ఓట్స్* బ్రాండ్‌గా అవతరించిన సఫోలా
కాంతార్ హౌస్‌హోల్డ్ ప్యానెల్ డేటా ప్రకారం, మారికో లిమిటెడ్ ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన సఫోలా ఓట్స్ భారతదేశంలో నంబర్ 1 ఓట్స్* బ్రాండ్‌గా అవతరించింది. 2011 లో ప్రారం భమైనప్పటి నుండి, భారతీయ వినియోగదారుల విభిన్న రుచి ప్రాధాన్యతలను అందుకోవడానికి మరియు “మీ కోసం మెరుగైన” ఆహార ఉత్పత్తులను అందించడానికి విశ్వాసం, వినియోగదారుల అవగాహన, వినూత్నతల వారసత్వంగా ఈ బ్రాండ్ రూపొందించబడింది.
సఫోలా ఓట్స్ క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది, వినియోగదారుల రోజువారీ అల్పాహారం ఎంపి కలలో తిరుగులేనివిధంగా ప్రధానమైందిగా మారుతూ, ఈ విభాగంలో గణనీయ వృద్ధిని సాధించింది. బ్రాండ్ ప్రారంభ మైనప్పటి నుండి విక్రయాలలో ఆశ్చర్యకరంగా పదిరెట్ల పెరుగుదలను సాధించింది. కాంతార్ హౌస్ హోల్డ్ ప్యానెల్ డేటా ప్రకారం, సఫోలా ఓట్స్ ఇప్పుడు మార్కెట్లో 43% వాటాను కలిగి ఉంది. ఇది అన్ని మిగితా పోటీదారులను అధిగమించింది. దేశంలో వోట్స్ రోజువారీ వినియోగానికి సంబంధించి ప్రతి 11 ఇళ్లలో ఒకదాంట్లో చురుకుగా ఉంటోందని కూడా డేటా నొక్కి చెబుతుంది.
ఈ అభివృద్ధి గురించి మారికో లిమిటెడ్ ఎండీ, సీఈఓ సౌగతా గుప్తా మాట్లాడుతూ, ‘‘మేం ఈ ముఖ్యమైన మైలురాయిని సాధించడం, ఓట్స్ విభాగంలో అగ్రగామిగా ఎదగడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది శ్రేష్ఠత, వినూత్నత, వినియోగదారుల సంతృప్తి పట్ల మా అంకితభావానికి నిదర్శనం. రుచి విషయానికి వస్తే భారతీయులు అస్సలు రాజీపడరు. ఈ ప్రాథమిక అంశాన్ని గుర్తించడం ద్వారా మేం వోట్స్ ని భారతీయ రుచి ప్రాధాన్యతలకు అనుగుణంగా భారతీయీకరించడం ప్రారంభించాం, అదే సమ యంలో అది అందించే ఆరోగ్య ప్రయోజనాలను సజావుగా ఏకీకృతం చేస్తాం. మేం మా ఉత్పత్తి పోర్ట్ ఫోలియోలో చిరు ధాన్యాలను స్వీకరించాం. మా సఫోలా వోట్స్ శ్రేణిలో ఓట్స్, మిల్లెట్స్ అనే రెండు శక్తివంతమైన ఆహారాల మంచితనాన్ని మిళితం చేశాం. మా వినియోగదారులను ఆహ్లాద పరచడా నికి మా అచంచలమైన నిబద్ధత మాకు వోట్స్ ను ఒక వర్గంగా విప్లవాత్మకంగా మార్చడంలో సహాయపడింది. సఫోలా వోట్స్ ను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. భారతదేశ నంబర్ 1 ఓట్స్* బ్రాండ్ గౌరవనీయమైన స్థానాన్ని పొందింది. మా కస్టమర్ల విశ్వాసం మరియు ‘మీ కోసం మెరుగైన’ ఉత్పత్తులను అందించాలనే మా నిబద్ధతతో మా ప్రయాణం కొనసాగుతుంది’’ అని అన్నారు.
సఫోలా ఓట్స్ తన విజయానికి నాణ్యత, రుచి పట్ల అచంచలమైన నిబద్ధత కారణమని పేర్కొంటోంది. విని యోగదారులు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో బ్రాండ్‌కు తమ విపరీతమైన మద్దతును అందించారు. ఈ ప్రాంతాల్లోని ఇళ్లలో ఇది ప్రధానమైందిగా మారింది.
ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారు మార్కెట్ లో సఫోలా ఓట్స్ త్వరితగతిన స్వీకరించ బడింది. పోటీ సాదా వోట్స్ మార్కెట్లో 21వ ఉత్పాదనగా సఫోలా ఓట్స్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రతి మూలలో చట్పాటా స్ట్రీట్ ఫుడ్‌లో తరచుగా కనిపించే మసాలెదార్ (స్పైసీ) రుచులపై వారి ప్రేమను గుర్తించి ఈ బ్రాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘సావరీ ఓట్స్’ని పరిచయం చేయడం ద్వారా ఈ డిమాండ్‌ను తీర్చడానికి వ్యూహాత్మకంగా ముందుకు వచ్చింది.
వోట్స్ ఆరోగ్య ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడం ద్వారా బ్రాండ్ ప్రయాణం ప్రారం భమైంది. ముఖ్యంగా బరువు నిర్వహణలో, ఆపై బరువు తగ్గించే ఉత్పత్తిగా భావించడం నుండి బరువు తగి నంతగా ఉండేలా చూసుకునే వారికి ప్రధానమైందిగా పరివర్తన చెందింది. అంతేకాకుండా, వినియోగ దారులతో మమేకం కావడానికి ఈ బ్రాండ్ అంతర్జాతీయ రుచులు, ప్రాంతీయ వంటకాలతో పరిమిత ఎడి షన్ ఎంపికలను కూడా అందించింది. స్వీట్ ట్రీట్‌ను కోరుకునే వారికి తీపి రకాలను కూడా అందిస్తోంది.
చిరుధాన్యాలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా, సఫోలా తన ఓట్స్ పోర్ట్ ఫోలియోను సఫోలా ఓట్స్ గోల్డ్ ను ప్రారంభించడం ద్వారా విస్తరించింది. ఇది మిల్లెట్ (జొన్న) మరియు ఓట్స్ అనే రెండు సంపూర్ణ ధాన్యాల మిశ్రమాన్ని అందిస్తుంది.
సఫోలా వోట్స్ ఒక సూపర్-క్రీమ్ ఆకృతిని అందిస్తుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా సేకరించబడిన సాఫ్ట్ & 100% సహజమైన హోల్‌గ్రెయిన్ వోట్స్ నుండి తయారు చేయబడింది. ఓట్స్ పోషకాల గని. ప్రొటీన్, ఐర న్, ఫైబర్‌ని అందజేసి, మీరు రోజంతా గడిపేందుకు ఎక్కువ కాలం శక్తిని అందిస్తాయి. దీని రుచికర మైన వేరియంట్, సఫోలా మసాలా ఓట్స్ అనేది క్లాసిక్ మసాలా, పెప్పీ టొమాటో, వెజ్జీ ట్విస్ట్, మసాలా కొరి యండర్, కర్రీ పెప్పర్ వంటి అనేక రకాల రుచులను అందిస్తుంది. వినియోగదారులని మొదటి స్థానంలో ఉంచాలని మేం విశ్వసిస్తున్నాం మరియు ఇది సఫోలా వోట్స్ లోని ప్రతి స్పూన్ ఆహారంలో స్పష్టంగా కనిపిస్తుంది.
*(ఓట్స్ విభాగానికి సంబంధించి కాంతార్ హౌస్ హోల్డ్ ప్యానెల్ డేటా నివేదించిన డేటా ఆధారంగా,2022 డిసెంబర్ 31తో ముగిసిన 12 నెలల కాలానికి, ఆల్ ఇండియా (యు) మార్కెట్. (Copyright © 2022, Kantar)
మారికో లిమిటెడ్ గురించి:
మారికో (BSE: 531642, NSE: “MARICO”) అనేది గ్లోబల్ బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో భారతదేశంలోని ప్రముఖ వినియోగదారు ఉత్పత్తుల కంపెనీలలో ఒకటి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మారికో భారతదేశంలో విక్రయించిన ఉత్పత్తుల ద్వారా మరియు ఆసియా, ఆఫ్రికాలో ఎంచుకున్న మార్కెట్ల ద్వారా సుమారు USD 1.2 బిలియన్ల టర్నో వర్ను నమోదు చేసింది.
పారాచూట్, సఫోలా, సఫోలా ఫిట్టీఫై గౌర్మెట్, సఫోలా ఇమ్యునివేద, సఫోలా మీల్మేకర్, హెయిర్ & కేర్, పారాచూట్ అడ్వాన్స్ డ్, నిహార్ నేచురల్, మెడికర్, ప్యూర్ సెన్స్, కోవ్ సోల్, రివైవ్, సెట్ వెట్, లివాన్, జస్ట్ హెర్బ్స్, ట్రూ ఎలిమెంట్స్, బేర్డో మరియు ప్లిక్స్ వంటి బ్రాండ్ల పోర్ట్ ఫోలియో ద్వారా మారికో ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరి జీవితాలను తాకింది. అంతర్జాతీయ వినియోగదారు ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో పారాచూట్, పారాచూట్ అడ్వాన్స్ డ్, హెయిర్కోడ్, ఫియాన్సీ, కైవిల్, హెర్క్యులస్, బ్లాక్ చిక్, కోడ్ 10, ఇంగ్వే, ఎక్స్-మెన్, థువాన్ ఫాట్ మరియు ఐసోప్లస్ వంటి బ్రాండ్లతో గ్రూప్ ఆదాయంలో దాదాపు 23%కి దోహదం చేస్తోంది.






