అధ్యక్ష ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని.. రష్యా రికార్డు స్థాయిలో
వచ్చే ఏడాది మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రష్యా తన ఫెడరల్ బడ్జెట్ను ఏకంగా 25 శాతం పెంచింది. ఇందులో అధిక మొత్తం రక్షణకు కేటాయించింది. ఆ దేశ దిగువ సభ డ్యూమా బడ్జెట్ను ఆమోదించింది. రక్షణ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం గమనిస్తే ఇప్పటి వరకు ఆధునిక రష్యా చరిత్రలో సామాజిక అవసరాలకు కేటాయించిన బడ్జెట్ను అధిగమించేలా కనిపిస్తోంది. సామాజిక రంగం కేటాయింపులు తక్కువ నిరుద్యోగం, అధిక వేతనాలకు దోహదపడుతుండగా, దానికి ప్రాధాన్యం తగ్గిస్తే దీర్ఘకాలికంగా ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంక్షల ప్రభావాన్ని తట్టుకొని, మిలిటరీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చట్టసభ్యులు 2024`26 బడ్జెట్ను రూపొందించినట్లు డ్యూమా చైర్మన్ వ్యాచెస్లేవ్ వెల్లడిరచారు. 2024లో 39 శాతం బడ్జెట్ రక్షణ, లా ఎన్ఫోర్స్మెంట్కు వెళ్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2024 మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్, చట్టసభ్యుల రక్షణను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రికార్డు స్థాయిలో పెట్టినట్లు అభిప్రాయపడుతున్నారు.






