Rupee Value: రూపాయి విలవిల.. చరిత్రలోనే కనిష్ట స్థాయికి పతనం!
భారత కరెన్సీ రూపాయి (Rupee Value) రోజురోజుకూ బలహీనపడుతూ ఆందోళన కలిగిస్తోంది. గురువారం నాడు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ. 90.46కు చేరింది. ఇది చరిత్రలోనే రూపాయికి అత్యంత కనిష్ట స్థాయికి దిగజారింది. డిసెంబర్ 4 నాటి రికార్డును (90.42) ఇది అధిగమించడం ఆర్థిక వర్గాల్లో కలకలం రేపుతోంది. బడా కార్పొరేట్ సంస్థలు భారీగా డాలర్లను కొనుగోలు చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత లేకపోవడం ఈ (Rupee Value) పతనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రూపాయి త్వరలోనే రూ. 90.70 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నష్ట నివారణ చర్యలకు దిగింది. రూపాయి పతనాన్ని (Rupee Value) అడ్డుకునేందుకు దేశీయ మార్కెట్లతో పాటు లండన్, సింగపూర్, దుబాయ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ డాలర్లను విక్రయిస్తోంది. నాన్-డెలివరబుల్ ఫార్వార్డ్స్ (NDF) ద్వారా జోక్యం చేసుకొని, రూపాయి పతనానికి అడ్డుకట్టలు వేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.






